నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.. నువ్వు నా ప్రేమని కాదన్నా కూడా నా హృదయం బ్రద్దలవలేదెందుకా అని..నీ పరిచయం అయిన మొదట్లో అనుకునే వాడ్ని..నువ్వు శ్వాసించడం చూసాకే నేను బ్రతికున్నాననే విషయం జ్ఞాపకం వచ్చింది అని ..అంతే ముందటి నా పుట్టుకని మర్చిపోయి మళ్ళీ జన్మించా...కొత్తగా...
నేను 'దేవదాసు' అంతగా బాధపడలేదనో,నా గుండె బ్రద్దలవలేదనో నీవంటే ప్రేమ లేదని అనుకోకు..నాది ప్రేమ కాదు ..'ఆరాధన'...ఎంతగా అంటే జరిగిపోయిన నీ గతాన్ని కూడా నా కళ్ళముందు దర్శింపచేసుకోవాలన్నంతగా..
నీ పేరుని ఈ ప్రపంచంలో ఎవ్వరూ వ్రాయనంత అందంగా వ్రాయాలని కాలిగ్రఫీ ఎంతగా ప్రాక్టీసు చేసానో..నీ పేరుని అందరికంటే తియ్యగా పలకాలని సరిగమలు కూడా నేర్చుకున్నా.. ఏ కొంచం పెయింటింగ్ వచ్చినా నిన్ను పెయింట్ చేసే వాడ్నే..ఏ కొంచం వ్రాయడం వచ్చినా నీ గురించి వ్రాద్దామనే.. కాని ఇవేవి కుదరవని తెల్సి బాధపడ్డా..ఒక్కటే తెలుసు నాకు..నిన్ను ప్రేమించడం, క్షణం తీరిక లేకుండా నిన్ను ఆరాధించడం..
నువ్వు నడిచిన దారిలో పువ్వులు చాలా అందంగా కనిపించేవి నాకు.. ఎందుకో అనుకునేవాడ్ని..ఆ తర్వాతే తెల్సింది అవి నీ నవ్వులతో పొటీపడేవని.. ఇపుడు ఆ పువ్వులే అడుగుతున్నాయ్ నన్ను నువ్వు నా ప్రేమని కాదన్నా నేను బాధపడలేదని తెలిసి "సిగ్గులేనివాడా నీకు ప్రేమంటే తెలుసా అసలు" అని.నువ్వు చెప్పు నాకు ప్రేమంటే తెలీదా?
అయినా నువ్వు నన్ను ప్రేమించడానికే 'నో' అన్నావ్ గానీ..నిన్ను ప్రేమించొద్దు అనలేదుగా..
జీవితాంతం నిన్ను ప్రేమిస్తుంటా కానీ నీప్రేమకోసం వేచి చూడను..నీ కోసం ఎదురు చూడను..ఎందుకంటావా? నేను నిన్ను ప్రేమిస్తూ నా ప్రేమలో సఫలం అయ్యాను నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఓటమి పాలయ్యావ్...
అందుకే నువ్వు కాదన్నా బాధపడను..
6 కామెంట్లు:
baagundi ra.. gud one.. :)
good one............
nice one!
థ్యాంక్స్..
nice... idhee story nadhi kuda...
madhav chala bagundi ra...
కామెంట్‌ను పోస్ట్ చేయండి