ఏప్రిల్ 21, 2009

వెన్నెల అలిగింది..

వెన్నెలేమైనా  నీ దగ్గరకు గానీ వచ్చిందా? ఏం లేదులే ఇవాళ   ఇక్కడ లేదు..నీకు తెలుసు కదా వెన్నెలంటే నాకు చాలా ఇష్టమని.వెన్నెల్లో తడుస్తుంటే నీతో కలిసి నవ్వుతున్నట్లు ఉంటుంది నాకు...నిన్న వెన్నెలనే చూస్తూ కూర్చున్న.ఏంటి అలా చూస్తున్నావ్ నన్నే అనడిగింది.ఏం లేదు నువ్వు అందంగా ఉంటావా లేక తను అందంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను  అని చెప్పా అంతే ఎక్కడలేని ఉత్సాహంతో అడిగింది హా చెప్పు ఎవరు బావుంటారు  అనడిగింది ఇక చెప్పక తప్పలేదు.. నీకన్న తనే అందంగా ఉంటుంది అని  చెప్పా..బాధపడిందనుకుంటాను  మొహం అదోలా పెట్టి నిజమా అనడిగింది.అంత నమ్మకం లేకపోతె వెళ్లి చూసిరా అని చెప్పను.ఇపుడు నీ దగ్గరికే వచ్చిందనుకుంటాను ఏదోకటి  చెప్పి పంపేయి..

 

 

ఏప్రిల్ 10, 2009

అందం

మొన్నెవరో అందాన్ని నిర్వచించమన్నారు.. 
నేనేమో నీ పేరు చెప్పా..

ఏప్రిల్ 07, 2009

నేనో ప్రేమికుడ్ని..


నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.. నువ్వు నా ప్రేమని కాదన్నా కూడా నా హృదయం బ్రద్దలవలేదెందుకా అని..నీ పరిచయం అయిన మొదట్లో అనుకునే వాడ్ని..నువ్వు శ్వాసించడం చూసాకే నేను బ్రతికున్నాననే విషయం జ్ఞాపకం వచ్చింది అని ..అంతే ముందటి నా పుట్టుకని మర్చిపోయి మళ్ళీ జన్మించా...కొత్తగా...  

నేను 'దేవదాసు' అంతగా బాధపడలేదనో,నా గుండె బ్రద్దలవలేదనో నీవంటే ప్రేమ లేదని అనుకోకు..నాది ప్రేమ కాదు ..'ఆరాధన'...ఎంతగా అంటే జరిగిపోయిన నీ గతాన్ని కూడా నా కళ్ళముందు దర్శింపచేసుకోవాలన్నంతగా.. 

నీ పేరుని ఈ ప్రపంచంలో ఎవ్వరూ వ్రాయనంత అందంగా వ్రాయాలని కాలిగ్రఫీ ఎంతగా ప్రాక్టీసు చేసానో..నీ పేరుని అందరికంటే తియ్యగా పలకాలని సరిగమలు కూడా నేర్చుకున్నా.. ఏ కొంచం పెయింటింగ్ వచ్చినా నిన్ను పెయింట్ చేసే వాడ్నే..ఏ కొంచం వ్రాయడం వచ్చినా నీ గురించి వ్రాద్దామనే.. కాని ఇవేవి కుదరవని తెల్సి బాధపడ్డా..ఒక్కటే తెలుసు నాకు..నిన్ను ప్రేమించడం, క్షణం తీరిక లేకుండా నిన్ను ఆరాధించడం.. 

నువ్వు నడిచిన దారిలో పువ్వులు చాలా అందంగా కనిపించేవి నాకు.. ఎందుకో అనుకునేవాడ్ని..ఆ తర్వాతే తెల్సింది అవి నీ నవ్వులతో పొటీపడేవని.. ఇపుడు ఆ పువ్వులే అడుగుతున్నాయ్ నన్ను నువ్వు నా ప్రేమని కాదన్నా నేను బాధపడలేదని తెలిసి "సిగ్గులేనివాడా నీకు ప్రేమంటే తెలుసా అసలు" అని.నువ్వు చెప్పు నాకు ప్రేమంటే తెలీదా?  

అయినా నువ్వు నన్ను ప్రేమించడానికే 'నో' అన్నావ్ గానీ..నిన్ను ప్రేమించొద్దు అనలేదుగా..  

జీవితాంతం నిన్ను ప్రేమిస్తుంటా కానీ నీప్రేమకోసం వేచి చూడను..నీ కోసం ఎదురు చూడను..ఎందుకంటావా? నేను నిన్ను ప్రేమిస్తూ నా ప్రేమలో సఫలం అయ్యాను నువ్వే నన్ను ఫ్రేమించడంలో ఓటమి పాలయ్యావ్...

అందుకే నువ్వు కాదన్నా బాధపడను..

ఏప్రిల్ 06, 2009

బిట్స్-పిలాని లో చలికాలం..

బిట్స్-పిలాని లో  చలికాలం నాకు చాలా నచ్చేది ..మా శ్రీగాడు క్లిక్ మనిపించిన   కొన్ని ఫొటోస్..


హార్ట్ బ్యాంకు


బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లే హార్ట్ బ్యాంకులు ఉంటే బాగుండు..
ఎవర్నో ఇష్టపడి హృదయం బద్దలయినపుడల్లా..కొత్త గుండె తెచ్చిపెట్టుకోవచ్చు.. 

ఏప్రిల్ 04, 2009

పయనం

జీవన పయనంలో ప్రతికలయిక విడిపోవడానికే అయితే ఒడ్డుని తాకిన ప్రతి కెరటం అడుగుతుంది నేనెవర్నని???

ఏప్రిల్ 03, 2009

వాడు

ఒక మనిషిలో ప్రేమ ద్వేషం సమపాళ్ళలో ఉంటాయని 'వాడ్ని ' చూసాకే తెల్సింది నాకు.'వాడు' ఎంతగా ప్రేమించగలడో అంతగా ద్వేషించగలడు..

'వాడి' ద్వేషం మండే వేసవయితే..'వాడి' ప్రేమ పున్నమి నాటి వెన్నెల ..ఏదైనా అందులో తడవాల్సిందే,అనుభవించాల్సిందే చెబితే అర్థం కాదు .'వాడు' ఒకర్ని ప్రేమించాడు అంటే పూజిస్తాడు ,ఆరాధిస్తాడు.అదే ద్వేషించాడా మళ్ళీ కలుసుకోలేనందూరం జరిగిపోతాడు.

ఎవరైనా ప్రేమ ,ద్వేషం ఏదో ఒక్కటే చూపించగలరు .కానీ 'వాడు' ప్రత్యేకం ,రెండూ extream వాడిలో..

"ఫ్రేమించిన మనిషిని ఎలా ద్వేషించగలవ్ రా అంటే ?".. " ప్రేమించలేదూ అలానే " అంటాడు ..'వాడి' ప్రేమ,ద్వేషం ఏదీ శాశ్వితం కాదు  అలానే తాత్కాలికమూ కాదు 'వాడి'కి మల్లే ..