మే 09, 2009

మహర్షి


మహర్షిలా ధ్యానిస్తున్నా నీమౌనానైనా విందామని
నిన్ను మరచి బ్రతకలేక అలాగని గుర్తుంచుకొని చనిపోలేక ప్రేమించడం నేర్పిన నువ్వే మరచిపోవడం నేర్పుతావనే ఎదురుచూపు
నీలో పొగట్టుకున్న నన్ను నేను అన్వేషిస్తూ నాలోకి నేను చేసే నిరంతర ప్రయాణమిది
నీ జ్ఞాపకాలంటని మరో పుట్టుక కోసం ఈ రాత్రికి మరణిస్తున్నా....

నా జ్ఞాపకాల సమాధి మీద పూసిన గడ్డిపూలనైనా స్వీకరిస్తావనే చివరి ఎదురుచూపు